`వైఫ్ ఆఫ్ రామ్‌..`! మ‌రో క‌హాని ఆలియాస్ అనామిక కాదు క‌దా!

హైద‌రాబాద్‌: మంచు ల‌క్ష్మి న‌టిస్తోన్న తాజా చిత్రం `వైఫ్ ఆఫ్ రామ్‌`. ఆద‌ర్శ్‌, ప్రియ‌ద‌ర్శి, సామ్రాట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ యేల‌కంటి ద‌ర్శ‌కుడు. గాయ‌కుడు ర‌ఘు దీక్షిత్ సంగీత ద‌ర్శ‌కుడిగా తెలుగుతెర‌కు ప‌రిచయం అవుతున్నారు.

ఈ సినిమా టీజ‌ర్ శుక్ర‌వారం విడుద‌లైంది. అక్కినేని నాగార్జున టీజ‌ర్‌ను ఆవిష్క‌రించారు. త‌న భ‌ర్త రామ్‌ను హ‌త్యకేసు ఛేదించే స‌గ‌టు ఇల్లాలి పాత్ర‌లో మంచు ల‌క్ష్మి న‌టించారు. `రామ్‌ను ఎవ‌రో పైనుంచి తోసేసి చంపేశారు స‌ర్‌..` అనే మంచు ల‌క్ష్మి డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మౌతుంది.

సినిమా మొత్తం రామ్ హంత‌కుడెవ‌రో క‌నిపెట్ట‌డం చుట్టే తిరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆద‌ర్శ్ ఇందులో నెగెటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్ర‌ను పోషించిన‌ట్లు టీజ‌ర్ చూస్తే తెలిసిపోతోంది. బాలీవుడ్ సూప‌ర్‌హిట్ మూవీ క‌హానిని గుర్తుకు తెచ్చేలా అనిపిస్తోందీ టీజ‌ర్ చూస్తోంటే!

ఇదే క‌హానిని శేఖ‌ర్ క‌మ్ముల అనామిక పేరుతో న‌య‌న‌తార‌తో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రీమేక్ చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. వైఫ్ ఆఫ్ రామ్‌.. ఈ స‌మ్మ‌ర్‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ స‌మ్మ‌ర్‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here