గ్లామ‌ర్ డాల్‌..డీగ్లామ‌ర్ రోల్‌

హైఫై లుక్స్‌, అల్ట్రా మోడ్ర‌న్‌గా క‌నిపించే న‌టి స‌మంత‌. ఆమె తాజాగా న‌టిస్తోన్న `రంగ‌స్థ‌లం`లో డీ గ్లామ‌ర్ రోల్ ఎలా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టింది. `రామ‌ల‌క్ష్మి` పాత్ర‌లో ఒదిగిపోయింది.

రామ‌ల‌క్ష్మి ఆలియాస్ స‌మంత ఫ‌స్ట్‌లుక్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌. రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు సుకుమార్‌.

మైత్రి మూవీస్ బ్యాన‌ర్‌పై రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్త‌యింది. రామలక్ష్మి నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఓహోహో..ఏం వయ్యారం..ఏం వయ్యారం. ఏమాటకామాట సెప్పుకోవాలండీ.. అంటూ చిట్టిబాబు ఆలియాస్ రామ్‌చ‌ర‌ణ్ చేసిన కామెంట్లు బాగా పండాయి.

పల్లెటూరి అమ్మాయిగా సమంత లుక్స్ భ‌లేగా ఉన్నాయి. ఇలాంటి పాత్ర గ‌తంలో ఆమె ఎప్పుడూ చేయ‌లేదు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చిలో విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here