అనూష్క‌ను దెయ్యంలా మార్చింది ఈవిడే!

ముంబై: బాలీవుడ్ న‌టి అనూష్క శ‌ర్మ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందేమిటి? పోత పోసిన బంగారంలా ఉంటుంది. న‌డిచొచ్చే కుంద‌న‌పు బొమ్మ‌లా ఉంటుంది. ఛ‌స్‌..అది చూసే క‌దా విరాట్ కోహ్లీ ఫ‌స్ట్ బాల్‌కే క్లీన్ బౌల్డ‌య్యింది.

అంత‌టి అంద‌గ‌త్తె మరి దెయ్యంలా ఎలా మారింది? త‌న అంద‌చందాల‌తో క‌ల్లోకి రావాల్సిన ఈ అమ్మ‌డి భ‌య‌పెట్టే రూపం క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతోంటే గుండె చిక్క‌బ‌ట్టుకోవాల్సిందే. అంద‌మైన అనూష్క శ‌ర్మ‌ను ఇలా దెయ్యంలా ఎలా మార్చార‌నే డౌట్ అంద‌ర్లోనూ ఉంది.

దీనికి స‌మాధానం చెప్ప‌డానికా అన్న‌ట్టు అనూష్క శ‌ర్మ మేక‌ప్ మేకింగ్ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టారు. క్లోవ‌ర్ వూట్టాన్ అనే హాలీవుడ్ మేక‌ప్ విమెన్‌.. అనూష్క‌ను ఇలా దెయ్యంలా మార్చిన పాపాన్ని మూట‌గ‌ట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here