మెగా కాంపౌండ్ నుంచి మ‌రో హీరో ఎంట్రీ: క‌్లాప్ కొట్టిన చిరు

మెగా కాంపౌండ్ నుంచి మ‌రో హీరో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ హీరో పేరు క‌ల్యాణ్ దేవ్‌. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు. వారాహి చలనచిత్ర పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాయి కొర్రపాటి నిర్మాత‌.

మాళ‌విక నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాకేష్ శ‌శికి ఇది రెండో చిత్రం. గ‌తంలో జ‌త క‌లిసే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

తొలి షాట్‌కు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఎమ్ఎమ్ కీరవాణి కెమేరా స్విచాన్ చేశారు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ. ఇంకా సెలెక్ట్ చేయ‌లేదు గానీ.. త‌మ‌న్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకోవ‌చ్చ‌ట‌.

తనికెళ్ల భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్ తదితరులు న‌టిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు గానీ.. చిరంజీవి హిట్ సినిమాల్లోని పదాన్ని టైటిల్‌గా నిర్ధారించే ఛాన్స్ ఉంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here