`సంజు` వ‌చ్చేశాడు!

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం `సంజు`. ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరో. సంజ‌య్‌ద‌త్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న రాజ్‌కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మున్నాభాయ్ సిరీస్‌ల‌ను తీసింది ఈ ద‌ర్శ‌కుడే. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ముంబైలో ఏర్పాటైన ఈ కార్య‌క్ర‌మానికి సంజ‌య్‌ద‌త్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, రాజ్‌కుమార్ హిరాణీ హాజ‌ర‌య్యారు.

 

జూన్ 29వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానుంది. సంజ‌య్ ద‌త్ కేరీర్ ఆరంభం నుంచీ అత‌ను జైలు పాల‌య్యేంత వ‌ర‌కూ ప‌లు అంశాల‌ను ఇందులో స్పృశించారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ అచ్చు సంజ‌య్‌ద‌త్‌లాగే క‌నిపిస్తున్నారు. ప్ర‌త్యేకించి- మున్నాభాయ్ గెట‌ప్‌తో పాటు పుణే య‌ర‌వాడ జైలులో ఖైదీ దుస్తుల‌తో సంజ‌య్‌ద‌త్ స్వ‌యంగా వ‌చ్చి న‌టించాడ‌నే ఫీల్ క‌లిగిస్తోందీ మూవీ.

సంజ‌య్‌ద‌త్ తండ్రి సునీల్ ద‌త్‌గా ప‌రేష్ రావెల్‌, త‌ల్లి న‌ర్గీస్ ద‌త్‌గా మ‌నీషా కొయిరాలా, భార్య మాన్య‌త‌గా దియా మీర్జా, స్నేహితుడు, న‌టుడు కుమార్ గౌర‌వ్ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్‌, టీనా మునీమ్‌గా సోన‌మ్‌క‌పూర్‌, స‌ల్మాన్‌ఖాన్‌గా జిమ్ శ‌ర్భ‌, మాధురి దీక్షిత్‌గా క‌రిష్మా ట‌న్నా న‌టిస్తున్నారు. ఆయా న‌టీన‌టులంద‌రూ సంజ‌య్‌ద‌త్‌తో క‌లిసి న‌టించిన వారే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here