మ‌హేష్‌ మరోసారి ఆ `ఐర‌న్ లెగ్ బిల్డింగ్‌`లో అడుగు పెట్టాడే!?

హైద‌రాబాద్‌: బ‌స్ భ‌వ‌న్‌. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ, ప్ర‌త్యేక తెలంగాణ టీఎస్ ఆర్టీసీ ప్ర‌ధాన కార్యాల‌యం. అప్పుడప్పుడు ఆ భ‌వ‌నాన్ని సినిమా షూటింగుల‌కు కూడా అద్దెకు ఇస్తుంటారు. అద్దెకు ఇవ్వ‌డం ప‌ట్ల ఎవ‌రి నుంచీ ఎలాంటి కంప్లైంట్ లేదు గానీ.. ఆ భ‌వ‌నం అచ్చి రావ‌ట్లేద‌నే అనుమానాలు అభిమానుల్లో బ‌లంగా ఉన్నాయి. దాని చ‌రిత్రే అంత‌.

గ‌తంలో ఆర్టీసీ బ‌స్ భ‌వ‌న్‌లో షూటింగ్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ట‌యిన పాపాన పోలేద‌ని అభిమానులు చెబుతున్నారు. వెంక‌టేష్ `షాడో` అక్క‌డే తీశారు. ఆ సినిమా ఏమైందో అంద‌రికీ తెలుసు. అంతెందుకు? మొన్న‌టికి మొన్న మ‌హేష్‌బాబు `స్పైడ‌ర్‌` మూవీలో కొన్ని సీన్ల‌ను బ‌స్ భ‌వ‌న్‌లో చిత్రీక‌రించారు.

మ‌హేష్ కేరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిందా మూవీ. బ్యాక్ అండ్ బ్యాక్‌.. స్పైడ‌ర్ త‌రువాత న‌టిస్తోన్న `భ‌ర‌త్ అనే నేను..` మూవీలోని కొన్ని కీల‌క స‌న్నివేశాలను అదే బ‌స్ భ‌వ‌న్‌లో తీశారు.

పాత సెంటిమెంట్ల‌ను బేస్ చేసుకుని చూస్తే.. ఆ ఊహే భ‌యాన్ని రేకెత్తిస్తోంది మ‌హేష్ అభిమానులకు. షాడో, స్పైడ‌ర్.. ఈ రెండే కాదు గానీ.. ఇంకా చాలా సినిమాల‌ను తీశారందులో. అవేవీ పెద్ద హిట్ల‌ను కొట్టిన‌ట్టు లేవు.

అద‌లావుంచితే- నిమిషం ఎనిమిది సెకెన్ల పాటు ఉన్న `భ‌ర‌త్ అనే నేను..` టీజ‌ర్ మాత్రం చూపు తిప్పుకోనివ్వ‌లేదు. మ‌హేష్ చాలా, చాలా స్టైలిష్‌గా క‌నిపించాడు. న‌డ‌క‌, గెట‌ప్‌, వాయిస్‌.. అన్నిట్లోనూ వైవిధ్యాన్ని క‌న‌ప‌ర్చాడు. కొర‌టాల శివ టేకింగ్‌, దేవీశ్రీ ప్ర‌సాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సినిమాటోగ్ర‌ఫీ.. డిఫ‌రెంట్‌గా క‌నిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here