అందుకే అత‌డు..`సూప‌ర్‌స్టార్‌`

హైద‌రాబాద్‌/అమ‌రావ‌తి: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన తాజా చిత్రం `భ‌ర‌త్ అనే నేను..` రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతోంది. అది ఎలాంటి సినిమా అయినా స‌రే.. మార్నింగ్ షో నుంచే మ‌హేష్‌బాబు మూవీల‌కు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంటుంది.

మ‌హేష్‌బాబు కేరీర్‌లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన పోకిరి గానీ, శ్రీ‌మంతుడు గానీ..ఇలా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నవే. `భ‌ర‌త్ అనే నేను.. మాత్రం దీనికి భిన్నం. మ‌హేస్ సినిమాల‌కు నెగెటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేయ‌డానికి ధైర్యం చాల‌ట్లేద‌ని ఓ వెబ్‌సైట్ రాసుకొచ్చింద‌టే ఆ మూవీ స్టామినా ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌హేష్ అంటే పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని వెబ్‌సైట్లు కూడా పాజిటివ్ రివ్యూలు రాశాయి. మంచి రేటింగ్ ఇచ్చాయి. రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధమే లేని మ‌హేష్‌.. ఓ క‌మ‌ర్షియ‌ల్ మూవీలో ఏకంగా ముఖ్య‌మంత్రి పాత్ర‌ను ఎలా పోషిస్తాడ‌నే టెన్ష‌న్ అభిమానుల్లో ఉండేది. దాన్ని ఆయ‌న ప‌టాపంచ‌లు చేసేశారు.

ఏ మాత్రం ప‌రిచ‌యం లేని పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డ‌మే 100 శాతం న‌టుడి ల‌క్ష‌ణం. మ‌హేష్‌బాబు అదే చేశాడు. ప్రెస్‌మీట్ సీన్‌లో మ‌హేష్ పండించిన ఎమోష‌న్స్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ముఖ్య‌మంత్రిగా ఎంత సీరియ‌స్‌గా న‌టించాడో.. హీరోయిన్‌తో అంతే చిలిపి స‌న్నివేశాల్లో క‌నిపించాడు.

ఫైట్ సీన్‌ల‌ల్లో రౌద్రాన్ని ప‌లికించాడు. దుర్గ‌మ‌హ‌ల్ ఫైట్.. సాహో అనిపిస్తోంది. త‌న ప్ర‌తి సినిమాల్లోనూ అంత‌ర్లీనంగా సామాజిక సందేశాన్ని ఇచ్చే కొర‌టాల శివ‌.. ఈ సినిమాలోనూ త‌న పంథాను వీడ‌లేదు. అస‌లే పొలిటికల్ డ్రామా. స‌మాజానికి చెప్ప‌డానికి చాలా ఉంటుంది. తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది జ‌నానికి చెప్పేశాడు.

`నేను ఎంచుకున్న ముఖ్య‌మంత్రి పాత్ర‌కు మ‌హేష్‌ను ఎంచుకోవ‌డంతోనే స‌గం విజ‌యం సాధించా..`అంటూ కొర‌టాల శివ చెబుతున్నారు. కైరా అద్వాని, ప్ర‌కాశ్‌రాజ్‌, చాన్నాళ్ల త‌రువాత తెలుగు తెర‌పై క‌నిపించిన ర‌విప్ర‌కాష్‌, దేవ‌రాజ్.. ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ పాత్ర ప‌రిధిలో న‌టించారు.

సాధార‌ణంగా ఓ మూవీని హీరో త‌న భుజ‌స్కంధాల‌పై మోశాడ‌ని అంటుంటారు. ఇందులో అలాక్కాదు. ప్ర‌తి పాత్ర కూడా సినిమా హిట్ కావ‌డానికి కార‌ణ‌మౌతుంది. భ‌ర‌త్ ఇచ్చిన ఇండ‌స్ట్రీ హిట్‌తో మ‌హేష్‌బాబు త‌న ప్ర‌యారిటీల‌ను మార్చుకున్న‌ట్టు చెబుతున్నారు. వంశీ పైడిప‌ల్లితో చేసే 25వ సినిమా త‌రువాత ప్ర‌యోగాల జోలికి ఇక వెళ్ల‌క‌పోవ‌చ్చ‌నే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here