తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ళు తెరచుకోబోయేది ఎప్పుడంటే..!

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల లోని సినిమా హాళ్ళు మూసేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు థియేటర్లు తెరుస్తారా అని సినీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారం రోజుల బంద్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1700 థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడే అందుకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు రేపటి నుండి తెరచుకోబోతున్నాయి.

వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) ఛార్జీలు, కట్ ఆఫ్ టైమ్ తగ్గింపు విషయంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్‌పీ) దక్షిణాది సినీ నిర్మాతలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఇరు వర్గాల మధ్య ఈ రోజు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఛార్జీల విషయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్ఐఎఫ్‌సీసీ) ఐక్య కార్యాచరణ సమితి (జాక్)-డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో నిర్మాతల జాక్, ప్రదర్శనకారులు తమ సమ్మెను విరమించుకునేందుకు నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి సినిమాలు యథావిధిగా ప్రదర్శితమవుతాయి. ఏప్రిల్ 6 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. కొన్ని కొన్ని ఊర్లలో ఈరోజు సాయంత్రం నుండే సినిమాలు ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ మొత్తం ఒకే మాటపై నిలబడి ఈ పని సాధించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here