స‌ర్క‌స్ జీవితం..విన్యాసాలు చేస్తూ 25 అడుగుల ఎత్తు నుంచి..!

న్యూయార్క్‌: స‌ర్క‌స్‌లో క‌ళాకారులు చేసే విన్యాసాలు చూస్తే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. ఏ మాత్రం అదుపు త‌ప్పినా ప్రాణాలు గాల్లో క‌లుస్తాయి. స‌ర్క‌స్‌లో ప‌నిచేసే క‌ళాకారుల జీవితాల్లో గాల్లో దీపాల్లాంటివే. అలాంటి ఓ దీపం ఆరిపోయింది. స‌ర్క‌స్‌లో 15 ఏళ్ల పాటు ప‌ని చేసిన ఓ నిష్ణాతుడు.. విన్యాసాలు చేస్తూ, ప‌ట్టుత‌ప్పి 25 అడుగుల ఎత్తు నుంచి కింద‌ప‌డ్డాడు.

సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని థంపాలో చోటు చేసుకుంది. మృతుడి పేరు యాన్ అర్నాడ్‌. ఎరియ‌లిస్టిక్‌. గాల్లో విన్యాసాలు చేసే క‌ళాకారుడ‌ని అర్థం.

థంపాలో ఏర్పాటు చేసిన `స‌ర్కూ డ్యు సొలెయిల్‌`లో తోటి క‌ళాకారుడితో క‌లిసి విన్యాసాలు చేస్తుండ‌గా.. ప‌ట్టు త‌ప్పి కింద‌ప‌డ్డాడు. సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించాడు. అత‌ని మ‌ర‌ణానికి స‌ర్క‌స్ యాజ‌మాన్యం ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసింది. అత‌ని కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని, అన్ని విధాలా ఆదుకుంటామ‌ని భరోసా ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here