మ‌నోళ్లే రాశారు! బాలగంగాధ‌ర తిల‌క్‌..ఎ ఫాద‌ర్ ఆఫ్ టెర్ర‌రిజం!

బాలగంగాధ‌ర తిలక్‌.. ఎ ఫాద‌ర్ ఆఫ్ టెర్ర‌రిజం. విన‌డానికి ఎబ్బెట్టుగా ఉందీ లైన్‌. స్వాతంత్ర్య స‌మ‌రంలో కీల‌క పాత్ర పోషించిన బాల‌గంగాధ‌ర తిల‌క్‌ను ఉగ్ర‌వాదానికి పితామ‌హుడిగా వ‌ర్ణించారు. రాజ‌స్థాన్‌లో ఓ ప్రైవేటు విద్యాసంస్థ ముద్రించిన పుస్త‌కంలో ఈ ప‌దాలు ఉన్నాయి. రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ముద్రించిన ఎనిమిదో త‌ర‌గ‌తి సోషియ‌ల్ స్ట‌డీస్‌ పాఠ్య పుస్త‌కంలో ఈ లైన్లు క‌నిపించాయి.

బాల‌గంగాధ‌ర తిల‌క్‌ను ఉగ్ర‌వాద పితామ‌హుడిగా వ‌ర్ణించారు ఈ పాఠంలో. రాజ‌స్థాన్ బోర్డు సెకెండ‌రీ ఎడ్యుకేష‌న్ నుంచి గుర్తింపు పొందిన ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఈ పుస్త‌కాల‌ను అంద‌జేసింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మ‌ధుర‌కు చెందిన ప‌బ్లిష‌ర్ ఈ పాఠ్య పుస్త‌కాల‌ను ముద్రించారు.

సోషియ‌ల్ స్ట‌డీస్ పుస్త‌కంలోని 22వ చాప్ట‌ర్ 267వ పేజీలో ఈ లైన్లు ఉన్నాయి. `తిల‌క్ డిమాన్‌స్ట్రేటెడ్ ఎ పాత్ టువ‌ర్డ్స్ నేష‌న‌ల్ మూవ్‌మెంట్‌. దేర్‌ఫోర్‌, హి ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాద‌ర్ ఆఫ్ టెర్ర‌రిజం..` ముద్రించారు. 18, 19వ శ‌తాబ్దంలో జాతీయోద్య‌మ కీల‌క ఘ‌ట్టాలు` అనే అంశాన్ని చ‌ర్చిస్తూ ఈ లైన్ల‌ను రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here