నాగుపాము! రోడ్డు దాట‌బోయింది..తారుడ‌బ్బా రేకుపై అతుక్కుపోయింది..

అప్పుడే తారు రోడ్డు వేశార‌క్క‌డ‌. ఇంకా ఆ వేడి కూడా చ‌ల్లార‌లేదు. తారు డ్ర‌మ్మును వేడి చేసి, దాన్ని క‌త్తించారు. రోడ్డు ప‌క్క‌న వాటిని ప‌డేశారు. ఓ బుల్లి నాగుపాము జ‌ర‌జ‌ర‌మంటూ రోడ్డు దాటబోయింది.

తారు డ్ర‌మ్ము రేకుపై అతుక్కుపోయింది. ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్పటికీ ముందుకు క‌ద‌ల్లేక‌పోయింది. సుమారు అర‌గంట‌కు పైగా ఆ తారులో చిక్కుకుని అల్లాడిపోయిందా నాగుపాము.

అది ప‌డుతున్న అవ‌స్థ‌ను గ‌మ‌నించిన కార్మికులు.. స్థానికుల‌కు తెలియ‌జేశారు. వెంట‌నే వారు పాముల సంర‌క్ష‌కుడు కెంప‌రాజుకు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న కెంపరాజు.. సుర‌క్షితంగా పామును బ‌య‌టికి తీశారు.

సుర‌క్షిత ప్రాంతంలో వ‌దిలేశారు. క‌ర్ణాట‌క‌లోని మైసూరులో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. మైసూరులోని ఆర్బీఐ కాలనీ కొత్త‌గా తారు రోడ్డు వేస్తుండ‌గా.. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here