ఆవురావురంటూ మెక్కేసింది! ఆ త‌రువాతే..!

తిరువ‌నంత‌పురం: క‌ళ్లెదురుగా మాంఛి నాటుకోడి గుడ్ల క‌నిపించే స‌రికి ఎక్క‌డా లేని ఆక‌లి గుర్తుకొచ్చిందా పాముకు. వెనకా, ముందూ ఆలోచించ‌కుండా ఆవురావురంటూ గుడ్ల‌ను గుట‌కాయ స్వాహా చేసింది. ఆ త‌రువాతే దానికి త‌ప్ప‌లు మొద‌ల‌య్యాయి. ఆ గుడ్ల‌ను హ‌రాయించుకోలేక‌పోయింది. ఏడు గుడ్ల‌ను బ‌య‌టికి కక్కేసింది.

ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని వేనాడ్‌లో ఓ కోళ్ల ఫారంలో చోటు చేసుకుంది. పాము లోనికి ప్ర‌వేశించ‌డంతో కోళ్ల‌న్నీ ఒక్క‌సారిగా అటు, ఇటు ప‌రుగులు తీశాయి. దీన్ని గ‌మ‌నించిన పౌల్ట్రీ ఫాం య‌జ‌మాని వెళ్లి చూడ‌గా..లోప‌ల పాము క‌నిపించింది. వెంటనే స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని దాన్ని బయటకు తీశాడు.

అనంతరం పాము నోటి నుంచి ఏడు గుడ్లను బయటకు వదలడాన్ని వీడియో తీశాడు. మొత్తం ఎనిమిది గుడ్లను పాము మింగినట్లు స్నేక్‌ క్యాచర్‌ సుదీప్‌ తెలిపాడు. పాముకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

11/4/17Cobra@Kutivaal,Wayanadവയനാട്: മാനന്തവാടി തലപ്പുഴ കാപ്പാട്ടുമല കുറ്റിവാൾ ഗിരീഷിന്റെ വീട്ടിലെ കോഴിക്കൂട്ടിൽ കയറി അടയിരിക്കുന്ന കോഴിയെ വകവരുത്തുകയും,വിരിയാറായ 7 മുട്ടകൾ അകത്താക്കുകയും ചെയ്ത മൂർഖൻ.വീഡിയോ: രമേഷ് കുറ്റിവാൾSudhi Krishna

Sujith Vp Wynadさんの投稿 2018年4月12日(木)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here