క‌ళ్లు కూడా తెర‌వని కుక్క‌పిల్ల‌లు: ఒక్క‌టొక్క‌టిగా మింగేసిన పాము!

స‌రిగ్గా 24 గంట‌ల కింద‌టే ఓ వీధి కుక్క పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆరుకుపైగా ముద్దొచ్చే కుక్క‌పిల్ల‌లను క‌న్న‌ది. ఇంకా క‌ళ్లు కూడా తెర‌వ‌లేదా బుజ్జి కుక్క‌పిల్ల‌లు.

వాటిపై ఓ నాగుపాము క‌న్ను ప‌డింది. ఒక‌దానిపై ఒక‌టి ప‌డి ఉన్న కుక్క‌పిల్ల‌ల వ‌ద్ద‌కు చేరుకుంది. ఒక్క‌టొక్క‌టిగా గుటుక్కుమ‌ని మింగ‌డం ఆరంభించింది.

నాలుగు కుక్క‌పిల్ల‌ల‌ను మింగేసింది కూడా. ఈ లోగా స్థానికులు ఆ పామును చూసి.. స‌ర్పాల సంర‌క్ష‌కుడు శేఖ‌ర్ బిజ‌లికి స‌మాచారం ఇచ్చారు.

ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న శేఖ‌ర్‌.. పామును ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ధార్వాడలో చోటు చేసుకుంది.

ధార్వాడ‌ వీర‌భ‌ద్రేవ్వ‌ర న‌గ‌రలో ఉన్న ఖాళీస్థ‌లంలో ఓ వీధి కుక్క.. పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌గా.. ఓ పాము మూడు పిల్ల‌ల‌ను తినేసిన స‌న్నివేశాలను స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించారు.

ఈ స‌మాచారాన్ని శేఖ‌ర్ బిజ‌లికి ఇవ్వ‌డంతో.. ఆయ‌న పామును ప‌ట్టుకుని, సుర‌క్షిత ప్ర‌దేశంలో వ‌దిలేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here