పొద్దున్నే లేచి, ఎవ‌రి ముఖం చూశాడో గానీ.. `జ‌బ‌ర్ద‌స్త్` చ‌లాకీ చంటి టైమ్ బాగుంది! లేకుంటేనా!

‘జబర్దస్త్’ కమెడియన్ `చలాకి` చంటికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న కారు నుజ్జునుజ్జ‌యింది. అదృష్టం బాగుండి.. చంటి ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోగ‌లిగారు. ఆయ‌న‌కు గాయాలు త‌గ‌ల్లేదు.

తెలంగాణ‌లోని మహబూబ్‌ నగర్‌ జిల్లా బాలానగర్ స‌మీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. హైద‌రాబాద్ వైపు వ‌స్తోన్న ఆయ‌న కారును మరో కారు వెనుక వైపు నుంచి బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.

అదృష్టవశాత్తూ ఈ ప్ర‌మాదం నుంచి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంటికి స్వ‌ల్పంగా గాయ‌ల‌య్యాయి. ఆయ‌న‌కు ప్రాథ‌మిక చికిత్స చేశారు. అనంత‌రం- త‌న తోటి క‌మేడియ‌న్ల కారులో ఆయ‌న హైద‌రాబాద్‌కు వెళ్లారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here