పెళ్ళి చూపులు ప్రియదర్శి పెళ్ళికి వేళాయెనే.. అమ్మాయి ఎవరంటే..!

పెళ్ళి చూపులు సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ ప్రియదర్శి.. ప్రస్తుతం పలువురు స్టార్స్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఉన్నాడు. కమెడియన్ గా తనదైన ముద్ర వేసిన ప్రియదర్శి త్వరలో పెళ్ళి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఇటీవలే ప్రియదర్శికి పెళ్లి చూపులు అయ్యాయని తెలుస్తోంది.

ఇక అమ్మాయి ఎవరంటే రిచా శర్మ అట..! ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వెడ్డింగ్ హాల్ లో ప్రియదర్శి రిచా శర్మ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రియదర్శి బిజీ షెడ్యూల్ వల్ల చేసుకోలేకపోయాడు. గత ఏడాది ప్రియదర్శి చాలా సినిమాల్లో నటించాడు. మహేష్ బాబు స్పైడర్, జై లవ కుశ, ఎంసిఏ లాంటి సినిమాల్లో ప్రియదర్శి కనిపించాడు. ఈ ఏడాది కూడా ప్రియదర్శి నటించిన చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here