తమ గురువుగారు ప్రాణాలతో ఉండి ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేది: థర్టీ ఇయర్స్ పృథ్వీ

తమ గురువు దాసరి నారాయణరావు బతికున్నట్టయితే కత్తి మహేశ్-పవన్ కల్యాణ్ అభిమానులను కూర్చోబెట్టి, వారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేవారని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా పెద్ద మనిషి చొరవ చూపించి ముందుకు రావాలని, పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు, కత్తి మహేశ్ తో ఓ బహిరంగ చర్చ పెట్టి సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందనేది తన అభిప్రాయమని అన్నారు. ఈ చర్చకు అన్ని ఛానెళ్ల వాళ్లను కూడా ఆహ్వానించాలని సూచించారు.

అమ్మ గురించి కత్తి మహేశ్‌..
‘మా అమ్మ క్యాన్సర్‌తో పోరాడుతూ కొన్ని సంవత్సరాల కిందట చనిపోయారు. నా జీవితంలో నన్ను అమితంగా ప్రేమించిన వ్యక్తి, నన్ను బాగా చూసుకున్న వ్యక్తి మా అమ్మే’ అంటూ కత్తి మహేశ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. కత్తి మహేశ్‌ తల్లిని వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తూ.. ఆమె జీవితం గురించి పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here