ముగిసిన కామ‌న్వెల్త్ గేమ్స్‌..మ‌న‌కెన్నొచ్చాయంటే!

గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఏర్పాటైన కామ‌న్‌వెల్త్ గేమ్స్ మ‌నదేశ క్రీడాకారుల స‌త్తా చాటింది. ఈ వేడుక‌ల్లో భార‌త్‌.. మొత్తం 66 ప‌త‌కాల‌ను సాధించింది. ఇందులో 26 బంగారు, 20 ర‌జ‌తం, 21 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. 66 పతకాలతో భారత్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో నిలిచింది.

198 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 136 మెడ‌ల్స్‌తో ఇంగ్లండ్‌ రెండోస్థానంలో నిలాచియి. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ ఘన విజయం సాధించింది. సైనా నెహ్వాల్‌ బంగారు పతకం సాధించింది. పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో శ్రీకాంత్ రజతం పొందాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here