ఈ అమ్మ‌డు పాట మ‌నోభావాల‌ను కించ‌ప‌రుస్తున్నాయ‌ట‌: పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు!

ఒకే ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే స్టార్‌డ‌మ్‌ను తెచ్చుకున్న న‌టి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. ఈ ఒక్క బిట్‌సాంగ్‌లో ఆమె ప‌లికించిన హావ‌భావాలు చూసి ఫిదా అయ్యారు జ‌నం. అదే స్థాయిలో వివాదాన్ని కూడా తెచ్చిపెట్టిందా వీడియో.

ఆ పాట‌లోని ప‌దాలు త‌మ మ‌నోభావాల‌ను కింప‌రిచేలా ఉన్నాయంటూ కొంద‌రు హైద‌రాబాదీ ముస్లిం యువ‌కులు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు పాత‌బ‌స్తీలోని ఫ‌ల‌క్‌నుమా పోలీసులు కేసు నమోదు చేశారు.

మ‌లయాళం సినిమా ఒరు అదార్ లవ్‌లోని మాణిక్య మలారాయ పూవిస పాట‌లోని కొన్ని ప‌దాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని, త‌మ‌ను అగౌర‌వ ప‌రిచేలా ఉన్నాయ‌ని చెబుతున్నారు ముస్లిం యువ‌కులు.

దీనిపై ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకుడిపై కేసు న‌మోదు చేశారు. కేసు ఎంట్రీ చేశామ‌ని, ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని ఫ‌ల‌క్‌నుమా పోలీసులు వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here