వెర్రి వేయి విధాలు: క‌ండోమ్‌తో ఆట‌లు..ప్రాణాల‌తో చెల‌గాటం

సోష‌ల్ మీడియా విస్త‌రించిన కొద్దీ వెర్రి వెయ్యి త‌ల‌లు వేస్తోంది. త‌మ చిత్ర‌, విచిత్ర‌మైన విన్యాసాల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ద్వారా గుర్తింపు తెచ్చుకోవ‌డానికి తెగ ఆరాట‌ప‌డుతున్నారు జ‌నం. ప్రాణాంత‌క‌మైనా స‌రే.. ఆస‌క్తిక‌రంగా ఉంటే వ‌ద‌ల‌ట్లేదు.

కండోమ్‌ను ఇలాక్కూడా వినియోగించుకోవ‌చ్చ‌ని చెబుతోంది యూత్‌. కండోమ్ కొస‌ను ముక్కులో పెట్టుకుని, గ‌ట్టిగా పీల్చి, నోటి గుండా దాన్ని బ‌య‌టికి తీసుకుని రావాల‌ట‌. ఇప్పుడిదే ట్రెండింగ్‌గా మారింది. విదేశీ జ‌నం దీని ప‌ట్ల ఆస‌క్తి చూపుతున్నారు.

 

కండోమ్ ప్యాకెట్ చింపిన ద‌గ్గ‌రి నుంచి, దాన్ని ముక్క‌లోకి పెట్టుకుని, గాలి పీల్చ‌డం ద్వారా నోటి నుంచి దాన్ని పూర్తిగా బ‌య‌టికి లాగేంత వ‌ర‌కూ ఈ వింత ఆట కొన‌సాగుతుంది. అప్పుడే దీన్ని పూర్తి చేసిన‌ట్టవుతుంది. 1993లో ఓ వ్య‌క్తి మొద‌ట‌గా ఇలా చేసి చూపాడు. అప్ప‌ట్లో దీన్ని స‌ర్క‌స్ ఫీట్‌గా గుర్తించారు.

ఇప్పుడదే మ‌రోసారి వైర‌ల్‌గా మారింది. ఇది ప్రాణాంత‌కం. ఒక్కోసారి కండోమ్ ముక్కు ద్వారంలో ఇరుక్కుపోతే.. ప్రాణాలు పోవ‌డం మిన‌హా మ‌రో మార్గం లేద‌ని నిపుణులు సూచిస్తున్నారు. పైగా- కండోమ్‌ను క‌డ‌క్కుండా వినియోగించాల్సి ఉంటుంది కాబ‌ట్టి.. అందులో ఉన్న ర‌సాయ‌నాలు హాని క‌లిగిస్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here