శ్రీరామ నవమి ఎప్పుడంటే..?

ఈ ఏడాది శివరాత్రి విషయంలో వచ్చిన కంఫ్యూజనే.. శ్రీరామనవమి విషయంలో కూడా తలెత్తింది. తెలుగు రాష్ట్రాలలో ఒకో రోజు.. ఒకో చోట శ్రీరామనవమి చేసుకుంటూ ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం 26వ తేదీని శ్రీరామనవమి పండుగ చేసుకోవాలని ప్రకటించింది. భద్రాద్రిలో కూడా 26వ తేదీనే కల్యాణం చేస్తున్నారు. అష్టమితో కలిసి వచ్చిన నవమి పనికిరాదని అంటున్నారు. ధర్మసింధు ఇదే స్పష్టం చేస్తోందని కొందరు పండితులు చెబుతున్నారు. ఆ ప్రకారమే భద్రాచలంలోని 26వ తేదీనే భద్రాద్రిలో సీతారామకల్యాణం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 25వ తేదీనే శ్రీరామనవమిగా ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 25న వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవమి తిథి ఈనెల 25న సూర్యోదయం అయ్యాక వస్తుంది. 26వ తేదీ సూర్యోదయానికి ముందే ముగిసి.. సూర్యోదయ సమయానికే దశమి వచ్చేస్తుంది. 26వ తేదీ సూర్యోదయానికి ముందే నవమి వెళ్లిపోతోంది కాబట్టి.. 25వ తేదీనే నవమి వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here