కాంగ్రెస్ నేత‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు: ట‌్విట్ట‌ర్‌లో సంతాపం తెలిపిన సీఎం

శ్రీ‌న‌గ‌ర్‌: జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు పేట్రేగిపోయారు. జ‌మ్మూకాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గులాం న‌బీ ప‌టేల్‌పై కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఆయ‌న మ‌ర‌ణించారు. ప‌టేల్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందికి బుల్లెట్ గాయాల‌య్యాయి. జ‌మ్మూ కాశ్మీర్ ద‌క్షిణ ప్రాంతంలోని పుల్వామా జిల్లాలోని రాజ్‌పొర‌లో బుధవారం మ‌ధ్యాహ్నం ఈ కాల్పులు జ‌రిగాయి.

గులాం న‌బీ ప‌టేల్ వెళ్తోన్న కారుపై ఉగ్ర‌వాదులు బుల్లెట్ల వ‌ర్షాన్ని కురిపించారు. ఈ ఘ‌ట‌న‌లో పటేల్‌ మృతి చెందగా, అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ ఖండించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here