మ‌హాకాళి ఆల‌యంలో గ‌ర్భ‌గుడి ఎదురుగా సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తోన్న స్థితిలో త‌ల లేని మృత‌దేహం..!

ఓ మారుమూల గ్రామంలోని మ‌హాకాళి ఆల‌యం అది. తెల్ల‌వారు జామునే గుడికి వెళ్లాడు పూజారి. అడుగు పెట్టిన వెంట‌నే ఉలిక్కిప‌డ్డాడు.

 

గ‌ర్భ‌గుడికి ఎదురుగా సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తోన్న స్థితిలో క‌నిపించిన ఓ మృత‌దేహాన్ని చూసి నివ్వెర‌పోయాడు.

 

అమ్మ‌వారిని ద‌ర్శించ‌డానికి ఆయ‌న వెనుకే వ‌చ్చిన భ‌క్తులు కూడా ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించిన ఆ మృత‌దేహాన్ని చూసి భ‌యంతో వ‌ణికిపోయారు. ఆ మృత‌దేహానికి లేదు.

ఈ ఘ‌ట‌న ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో చోటు చేసుకుంది. మృత‌దేహం ఆన‌వాళ్ల‌ను బ‌ట్టి.. నాథాసాహు అనే వంట‌వాడిదిగా గుర్తుప‌ట్టారు స్థానికులు.

 

జిల్లాలోని బాగ్దేహి గ్రామంలో ఉన్న మ‌హాకాళ్ ఆల‌యంలో ఈ మృత‌దేహం ల‌భించింది. ఆల‌య పూజారి లైకెరా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

బ‌లి ఇచ్చి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. హ‌తుడు త‌ర‌చూ ఆల‌యంలో ప్ర‌సాదం వండుతుండేవాడ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here