ఇంటి ముందు ఆపిన టాటా మ్యాజిక్ వాహ‌నంలో..అర్ధ‌రాత్రి!

హ‌వేరి: ఇంటి ముందు ఆపిన టాటా మ్యాజిక్ వాహ‌నంలో అర్ధ‌రాత్రి ఓ అయిద‌డుగుల పొడవున్న‌ నాగుపాము తిష్ట వేసి క‌నిపించింది. తెల్ల‌వారుఝామున క‌ళ్లు నులుముకుంటూ వాహ‌నాన్ని తుడ‌వ‌బోయిన స‌ద‌రు వాహ‌నం డ్రైవ‌ర్‌..ఆ నాగుపామును చూసే స‌రికి వ‌ణికిపోయాడు. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు.

పాములు ప‌ట్ట‌డం అనుభ‌వం ఉన్న ఓ కానిస్టేబుల్.. దాన్ని ప‌ట్టుకుని సుర‌క్షితంగా స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి తాలూకా నాగ‌నూరు గ్రామంలో చోటు చేసుకుంది.

నాగ‌ప్ప మ‌ణ్ణూర అనే వ్య‌క్తికి చెందిన టాటా మ్యాజిక్ వాహ‌నం అది. అత‌ను స్థానికంగా డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. మంగ‌ళ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో త‌న వాహ‌నాన్ని ఇంటి ముందే ఆపాడు.

తెల్ల‌వారు జామున 5 గంట‌ల స‌మ‌యంలో నిద్ర లేచి, దాన్ని తుడ‌వ‌టం అత‌నికి అల‌వాటు. రోజూలాగే ఆ వాహనాన్ని తుడ‌వ‌టానికి వెళ్లిన నాగ‌ప్ప‌కు ఈ పాము క‌నిపించింది. వెంట‌నే అత‌ను స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా..ర‌మేష్ అనే కానిస్టేబుల్ దాన్ని ప‌ట్టుకుని ఓ ప్లాస్టిక్ డ‌బ్బాలో ఉంచి, సుర‌క్షిత ప్ర‌దేశంలో వ‌దిలివేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here