పోలీసులే వాహనాలకు నిప్పు పెట్టుకుంటూ వచ్చారు.. వైరల్ అవుతున్న వీడియో..!

గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే..! ఇప్పుడిప్పుడే ఈ అల్లర్లు అనిచేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ అలాగే వీడియో కూడా బయటకు వచ్చింది. అదేమిటంటే అల్లర్ల సమయంలో దగ్ధమైన కార్లను పోలీసులే తగులబెట్టారట. అల్లరి మూకలతో కలిసిపోయి పోలీసులే వాహనాలకు నిప్పు పెట్టుకుంటూ వచ్చారంటే షాక్ కు గురవుతున్నారు పై అధికారులు. కొందరు వ్యక్తులు తమ బాల్కనీలలో నుండి వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనమైంది.

దాదాపు 10 మంది పోలీసులు నిరసనకారులతో కలసి వాహనాలను తగులబెడుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆందోళన చేస్తున్న వారు పెట్రోలు క్యానులతో వెళుతుంటే, పోలీసులు వారికి సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ భవంతి కిటికీ నుంచి ఈ వీడియోను తీశారు. పోలీసుల వైఖరిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధ్వంసాలకు దగ్గరుండి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలుంటాయని అదనపు డీజీపీ బిపిన్ బిహారీ పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కకుండా చూడాలని అన్ని సామాజిక మాధ్యమ సంస్థలకూ అధికారులు ఆదేశాలు పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here