ఆమె క‌డుపు చుట్టూ చ‌ర్మం ఎందుకు క‌మిలిపోయిందో తెలుసుకున్న‌ డాక్ట‌ర్లు నివ్వెర‌పోయారు!

అయిదురోజులుగా ద‌గ్గు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌లేదామెకు. ప‌గ‌లు, రాత్రి తేడా లేకుండా ఒక‌టే ద‌గ్గు ఆమెను తెగ ఇబ్బందుల‌కు గురి చేసింది. లాభం లేద‌నుకుని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లింది.

ఒట్టి ద‌గ్గే క‌దా అనుకున్న డాక్ట‌ర్ ఆమెకు ఓ మాంఛి ద‌గ్గుమందు రాసిచ్చేశారు. మందుల వాడ‌కం మొద‌లు పెట్టిన త‌రువాత కూడా పెద్ద‌గా త‌గ్గ‌లేదు. స‌రిక‌దా! ప‌క్క‌టెముక‌ల్లో విప‌రీత‌మైన నొప్పి ఆరంభమైంది.

దీనితో ఆమె మ‌రోసారి ఆసుప‌త్రికి వెళ్ల‌గా.. డాక్ట‌ర్లు ప‌క్క‌టెముక‌ల‌కు స్కాన్ చేసి చూశారు. ఆమె ప‌క్క‌టెముక‌లు రెండు విరిగిపోయాయి. ఆమె ఎక్క‌డా కింద‌ప‌డ‌లేదు. ప్ర‌మాదానికీ గురి కాలేదు.

అయిన‌ప్ప‌టికీ.. ప‌క్క‌టెముక‌లు ఎలా విరిగాయో డాక్ట‌ర్ల‌కు అంతుచిక్క‌లేదు. దీనికి ఆమె చెప్పిన కార‌ణం విని డాక్ట‌ర్లు మరింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

ద‌గ్గువ‌ల్ల ప‌క్క‌టెముక‌లు విరిగిపోయి ఉంటాయ‌ని ఆమె చెప్పిన త‌రువాత ఆ కోణంలో ప‌రీక్షించ‌గా అది నిజ‌మని తేలింది. దీనిపై ఇంగ్లండ్‌కు చెందిన న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

అమెరికాలోని మ‌సాచుసెట్స్‌కు చెందిన ఆ మ‌హిళ పేరు గ్రేమీ. 66 సంవ‌త్స‌రాలు. ద‌గ్గే స‌మ‌యంలో ఆ ఒత్తిడి ప‌క్క‌టెముక‌ల‌పై ప‌డ‌టం వ‌ల్లే అవి విరిగిపోయాయ‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here