ఆ ఆలయం లోకి వెళ్ళలేకపోయానని మరోసారి బాధపడ్డ ఏసుదాస్.. బొద్దింక అయినా బాగుండేది..!

ఏసుదాస్ దేవుళ్ళ పాటలు పాడాలంటే ఆయన తర్వాతే ఎవరైనా.. క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు ఆయన. కొన్నేళ్ళ క్రితం ఆయన కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.. ఆలయాలు సందర్శిస్తుంటే లోనికి కూడా వెళ్ళనివ్వలేదు. ఈ అవమానాలపై ఆయన మరోసారి మాట్లాడారు. కనీసం తానొక బొద్దింకను అయి ఉండి ఉంటే ఆ గుళ్ళను దర్శించుకునే వాడినని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎర్నాకులంలోని త్రిపునితురలో తన తండ్రి అగస్టీన్ జోసెఫ్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థ తరపున అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను బొద్దింకను అయితే ఎంతో బాగుండేదని అపుడైనా తనకు ఆలయ ప్రవేశం దక్కేదని అన్నారు. శ్రీకృష్ణుడంటే అమితంగా ఇష్టపడే ఏసుదాస్ కు గురువాయూర్ లోని దేవాలయంలోకి అప్పట్లో అనుమతి నిరాకరించారు. అన్యమతస్థులకు ఆ ఆలయంలోకి ప్రవేశం లేకపోవడంతో ఏసుదాస్ నిరాశ చెందారు. దీంతో ఆ దేవాలయం బయటే చాలాసార్లు శ్రీకృష్ణుడిపై భక్తిపాటలు పాడారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఏసుదాస్ ఆ విషయం గురించి మాట్లాడారు. తాను బొద్దింకనో….మరే క్రిమికీటకాన్నో అయి ఉంటే గురువాయూర్ దేవాలయంలోకి సులువుగా ప్రవేశించే అదృష్టం దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here