మరికొన్ని గంటల్లో యాంకర్ ప్రదీప్ కు కౌన్సిలింగ్.. ఎన్ని రోజుల శిక్ష పడే అవకాశం ఉందంటే..!

మద్యం తాగి పట్టుబడ్డ తెలుగు టాప్ యాంకర్ ప్రదీప్ కు పోలీసులు మరికొన్ని గంటల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్ కు ఈరోజు హాజరుకావాల్సిందిగా పోలీసులు అతన్ని ఆదేశించారు. సుమారు 3 గంటల పాటు ప్రదీప్ కు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మూడు డాక్యుమెంటరీల ప్రదర్శనతో పాటు నిపుణుల కౌన్సెలింగ్ ఉంటుందట. డిసెంబర్ 31వ రాత్రి ఓ పబ్బులో మందు కొట్టి వచ్చి తన ‘టీఎస్ 07 ఈయూ 6666’ కారులో డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్ లో తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయాడు. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడి వాహనాన్ని సీజ్ చేసి శిక్ష అమలు చేస్తారు. కానీ ప్రదీప్ 178 పాయింట్ల రేంజిలో మందు తాగడంతో శిక్ష కాస్త ఎక్కువగానే నమోదు చేసే అవకాశం ఉంది.

కౌన్సిలింగ్ అనంతరం ప్రదీప్ ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక కోర్టులో అతడికి వారం రోజుల కంటే ఎక్కువగా శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది. ప్రదీప్ తన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లు తొలగించకపోవడంపై కూడా మరో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మోతాదుకు మించి ఆయన మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించిన పోలీసులు ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here