మెట్రోలో ఓ జంటను చితక్కొట్టిన ప్రజలు.. ఎందుకంటే..?

మెట్రోలో ఉన్న ఓ జంటను బయటకు లాక్కొచ్చి.. ప్రజలందరూ కలిసి చితక్కొట్టారు. ఈ ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. ఇంతకూ ఆ జంటను ఎందుకు అలా కొట్టారంటే… వాళ్ళు కౌగిలించుకొని నిలబడడమే..!

మోరల్ పోలీసింగ్ పేరుతో కొందరు వ్యక్తులు మెట్రోలో సన్నిహితంగా ఉన్న ఓ జంటను పట్టుకొని.. బయటకు లాగేశారు. లాగిన తర్వాత వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. వారు కౌగిలించుకోవడం ఆ కోచ్ లో ఉన్న కొందరికి నచ్చలేదు. దీంతో ఆ యువకుడిని పట్టుకొని చితకబాదారు. ఆ అమ్మాయి అతడిని కొట్టకుండా అడ్డు ఉన్నప్పటికీ వాళ్ళు వినలేదు. అతన్ని తన్నుతూ.. ఇష్టం వచ్చినట్లు బాదారు. ఈ ఘటన సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. మొదట వారిద్దరూ కౌగిలించుకోవడం ఇష్టం లేని ప్రయాణీకులు వారిని దూషించడం మొదలుపెట్టారు. డమ్ డమ్ మెట్రో స్టేషన్ రాగానే వాళ్ళను బయటకు లాగేశారు. ముఖ్యంగా మధ్య వయస్కులు.. ఏజ్ అయిన వాళ్ళు కలిసి వాళ్ళను కొట్టారు. ముఖ్యంగా ఆ యువకుడిని బలంగా బాదారు.

ఆ తర్వాత కొదరు ప్యాసెంజర్లు కొడుతున్న వారిని అడ్డుకొని.. ఆ జంటను పక్కకు పిల్చుకొని వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న సెక్యూరిటీ స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here