రెండురోజులుగా తెర‌వ‌ని ఇంటి త‌లుపు..అందులోంచి దుర్వాస‌న! వెళ్లి చూడ‌గా!

క‌డ‌లూర్‌: త‌మిళ‌నాడు క‌డ‌లూర్ జిల్లాలోని ఓ గ్రామం అది. దాని పేరు మేల్‌కీర‌పాళయం. ఆ ఇంట్లో ఓ మోస్త‌రు పేరున్న రాజ‌కీయ నాయ‌కుడు, త‌న భార్య‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు. ఊరి చివ‌ర్లో ఉండే ఓ ఇంటి త‌లుపు రెండురోజులుగా తెర‌చుకోలేదు.

ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు ఇంటి ప‌రిస‌రాల్లోకి వెళ్లారు. అక్క‌డికి వెళ్ల‌గానే గుప్పుమంటూ దుర్వాస‌న వారి ముక్కుపుట‌ల‌ను అద‌ర‌గొట్టింది. దీనితో వారు నేరుగా భువ‌న‌గిరి పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఇంటి త‌లుపుల‌ను ప‌గుల‌గొట్టి చూడ‌గా.. రెండు మృత‌దేహాలు క‌నిపించాయి. ఆ రెండూ ఆ రాజ‌కీయ నాయ‌కుడు, ఆయ‌న భార్య‌గా చెబుతోన్న మ‌హిళ‌ది. నిజానికి వారిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు కాద‌ని, ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌నే విష‌యం పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. మృతుల పేర్లు స‌హ‌దేవ‌న్‌.

మురుగేశ్వ‌రి. స‌హ‌దేవ‌న్‌కు భార్యా, పిల్ల‌లు ఉన్నారు. విభేదాల కార‌ణంగా వారు భ‌ర్త‌ను విడిచిపెట్టి వెళ్లారు. ఆ త‌రువాత స‌హ‌దేవ‌న్‌కు మురుగేశ్వ‌రితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. మురుగేశ్వరి కూడా భర్త నుంచి వేరుప‌డి ఒంట‌రిగా జీవిస్తోంది. వారిద్ద‌రి ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. మేల్ కీర‌పాళ‌యంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని స‌హ‌జీవనం చేస్తున్నారు.

మురుగేశ్వ‌రి గ‌ర్భం దాల్చ‌డం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్ట‌డంతో స‌హ‌దేవ‌న్ ఆమెతో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

సహాదేవన్‌ ఉరి వేసుకున్న స్థితిలో క‌నిపించ‌గా.. నేలమీద మురుగేశ్వరి మృతదేహం పడి ఉంది. వీరిద్దరి దేహాలు కుళ్లి పోవడంతో స్థానికులకు దుర్వాసన వచ్చింది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here