భార్య‌, పిల్ల‌లు ఉండీ డిగ్రీ విద్యార్థినితో ప్రేమ! ప్రియురాలితో క‌లిసి రైలు ప‌ట్టాల‌పై!

మూడేళ్ల కింద‌టే అక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడా యువ‌కుడు. ఆ దంప‌తుల‌కు ఆరునెల‌ల కుమారుడు ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ.. త‌న‌కు ప‌రిచ‌యమైన ఓ ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని ప్రేమించాడు.

ఇద్ద‌రూ త‌ర‌చూ క‌లుసుకునే వారు. ఇదివ‌ర‌కే త‌న‌కు పెళ్లి కావ‌డం వ‌ల్ల ఇక క‌లిసి జీవించ‌లేమ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాడు. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ప్రియురాలితో క‌లిసి రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం పూండీ సమీపంలోని బెండుగేటు వద్ద గురువారం సాయంత్రం ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న జ‌రిగింది.

మృతుల పేర్లు అప్ప‌ల్రాజు. ప‌ద్మ‌. అప్ప‌ల్రాజు ఇటుకల బట్టీ కార్మికుడు. రోజు కూలీగా పనిచేస్తున్నారు. 2015లో తన అక్క కుమార్తెను పెళ్లాడాడు. వారికి ఓ కుమారుడు.

ప‌ద్మ అనే డిగ్రీ విద్యార్థినితో అప్ప‌ల్రాజుకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ త‌ర‌చూ ఇటుక‌ల బ‌ట్టీ వ‌ద్ద కలుసుకునే వారు. రెండేళ్లుగా వారి ప్రేమ వ్యవ‌హారం కొన‌సాగుతోంది.

వారి ప్రేమ విష‌యం ప‌ద్మ సోద‌రుడు స‌తీష్‌కు తెలిసింది. ఇద్ద‌ర్నీ పిలిచి, మందలించాడు. పెళ్ల‌యిన వ్య‌క్తితో ప్రేమ ఏంటంటూ నిల‌దీశాడు.

గురువారం ఉదయం కళాశాలకు వెళ్తున్నాన‌ని ఇంట్లో నుంచి వెళ్లిన పద్మ శ్రీ‌కాకుళం చేరుకుంది. అక్క‌డ అప్ప‌ల్రాజును కలుసుకుంది.

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన ఇద్ద‌రు ప్రేమికులు శ్రీ‌కాకుళం నుంచి పూండి చేరుకున్నారు. పూండి రైల్వేస్టేషన్‌ సమీపంలో బెండిగేటు వ‌ద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు వారి గురించి ఆరా తీశారు.

పుస్త‌కాల ఆధారంగా ఆచూకీ తెలుసుకున్నారు. కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. మృత‌దేహాల‌ను ప‌లాస ఆసుప‌త్రికి పంపించారు. కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here