అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన కారులో సెక్స్‌: అత‌నికి జైలు..ఆమెకు బెయిల్‌

గుర్‌గావ్‌: అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్క్ చేసిన కారును త‌మ‌కు అనుకూలంగా మార్చుకుందో ప్రేమ‌జంట‌. ఎవ‌రికీ డిస్ట‌ర్బ్ ఉండ‌ద‌నుకుందో, ఏమో గానీ.. తీరిక దొరికిన‌ప్పుడల్లా సెల్లార్‌లో పార్క్ చేసిన కారులో సెక్స్‌కు ఉప‌క్ర‌మిస్తుండేవారు. ఒక‌ట్రెండు సార్లు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు అపార్ట్‌మెంట్ నివాసులు. బెదిరించి వ‌దిలేశారు.

అయిన‌ప్ప‌టికీ.. వారు త‌మ వైఖ‌రిని మార్చుకోలేదు. అదే అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో, అదే పార్కింగ్ ప్లేస్‌లో..సొంత‌కారులో రాస‌లీల‌లు కొన‌సాగించారు. దీనితో విసుగెత్తిపోయిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. హ‌ర్యానా గుర్‌గావ్‌లోని సెక్టార్ 15లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

సివిల్ లైన్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదైంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్ద‌ర్నీ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

త‌న‌ను బెదిరించి, లొంగ దీసుకునేవాడంటూ ఆ యువ‌తి పోలీసుల‌కు వివ‌రించడంతో.. యువ‌కుడిపై లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేశారు. నిందితుల పేర్లు తెలియ‌రావ‌ట్లేదు గానీ.. ఆ యువ‌కుడు ఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ఢ్ ప్రాంతానికి చెందిన వాడ‌ని పోలీసులు తెలిపారు. అత‌ణ్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించారు. యువ‌తిని బెయిల్‌పై విడుద‌ల చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here