ప‌బ్లిక్ టాయ్‌లెట్ వ‌ద్దే పెళ్లి చేసుకున్నారు..అక్క‌డే స్వీట్లూ తిన్నారు!

`టాయ్‌లెట్ లేక‌పోతే పెళ్లి లేదు. గిళ్లి లేదు. న‌న్ను పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో టాయ్‌లెట్ ఉండాల్సిందే..`ఇదీ ఆ యువ‌తి కండిష‌న్‌. 2017 మేలో ఆమె ఈ కండిష‌న్ పెట్టారు.

టాయ్‌లెట్ లేక‌పోతే పెళ్లి కాదేమోన‌నే భ‌యంతో వ‌రుడు అప్ప‌టిక‌ప్పుడు దాని కోసం మున్సిపాలిటీకి దర‌ఖాస్తు చేసుకున్నారు. టాయ్‌లెట్ నిర్మాణానికి అనుమ‌తి ల‌భించ‌డానికి నెల రోజులు ప‌ట్టింది.

ఆ ద‌ర‌ఖాస్తుకు అనుమ‌తి ల‌భించిన వెంట‌నే.. దాన్ని అత‌ను వ‌ధువుకు, ఆమె కుటుంబ స‌భ్యుల చేతికి అంద‌జేశాడు. దీనితో వారు పెళ్లి ఓకే అన్నారు.

టాయ్‌లెట్‌కు గుర్తుగా.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. దీనికోసం స్థానిక అధికారుల‌కు అనుమ‌తి కూడా తీసుకున్నారు.

బాపూమార్గ్‌లో ఉన్న ఓ ప‌బ్లిక్ టాయ్‌లెట్‌లో పెళ్లి చేసుకున్నారు. దండ‌లు మార్చుకున్నారు. అక్క‌డే స్వీట్లూ పంచుకుని తిన్నారు.

ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఆ యువ‌తి పేరు ష‌బా న‌వాజ్‌. వ‌రుడి పేరు స‌ర్ఫ‌రాజ్‌. గ‌త ఏడాదే ష‌బా న‌వాజ్‌ను పెళ్లి చేసుకోవాల్సి ఉండ‌గా.. స‌ర్ఫ‌రాజ్ ఇంట్లో వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్డి లేక‌పోవ‌డంతో పెళ్లికి ఆమె నిరాక‌రించారు.

టాయ్‌లెట్ క‌ట్టిన త‌రువాతే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో..నాలుగు నెల‌ల్లో దాన్ని నిర్మించేశాడు స‌ర్ఫ‌రాజ్‌. జ‌న‌వ‌రి 28న వారు ఓ ప‌బ్లిక్ టాయ్‌లెట్ సింపుల్‌గా పెళ్లి చేసుకుని దంప‌తుల‌య్యారు.

మున్సిపల్ అధికారులు, ఇత‌ర సిబ్బంది అంద‌రూ హాజ‌ర‌య్యారు. వారికి శుభాకాంక్ష‌లు చెప్పారు. సెల్ఫీలు దిగారు. వాటిని స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్‌కు పంపిస్తామ‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here