పాపను వదిలేసి ఆత్మహత్య చేసుకుంది తల్లిదండ్రులు కాదు.. బావామరదళ్లు.. షాకింగ్ ట్విస్ట్..!

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఓ జంట కుమార్తెను ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే, తాజాగా ఈ కేసులో షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. చనిపోయింది భార్యాభర్తలు కాదని, బావామరదళ్లు అని తేలింది.

కామారెడ్డిలోని పద్మాజీవాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం (35) వరుసకు మరదలైన దేవేంద్ర (30) మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. దేవేంద్ర భర్త రఘు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లగా ఐదేళ్ల బాబుతో ఆమె స్వగ్రామంలోనే ఉంటోంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య నుంచి విడాకులు తీసుకున్న కాశీరాం.. దేవేంద్రతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

కాశీరాం-దేవేంద్ర విషయం విషయంలో కులపెద్దలు పంచాయితీ నిర్వహించి కాశీరాంకు రూ.3 లక్షల జరిమానా విధించారు. తన భార్య అక్రమ సంబంధం గురించి తెలియడంతో దుబాయ్‌లో ఉంటున్న రఘు తనకు ఇక దేవేంద్ర వద్దని కులపెద్దలతో చెప్పినట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం బయటపడడం, ఊర్లో తలెత్తుకోలేకుండా అయిపోవడంతో దేవేంద్ర-కాశీరాంలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మృత‌దేహాల జేబులో దొరికిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతుల‌ను గుర్తించారు. వారిద్దరూ క‌లిసి పాపను ప్లాట్‌ఫాంపై చెట్టు కింద కూర్చోబెట్టి, బిస్కెట్ పాకెట్ ఇచ్చారని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. ఆ త‌రువాత వారిని ఎవ‌రూ పెద్ద‌గా గ‌మ‌నించ‌లేద‌ని అన్నారు. స్టేష‌న్‌క కొద్దిదూరంలో ప‌ట్టాల‌పై ఇద్ద‌రి మృత‌దేహాల‌ను క‌నిపించాయ‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here