భ‌గ‌భ‌గ‌మండుతున్న ఈ వ‌స్తువేంటో తెలిస్తే..జాగ్ర‌త్త‌ప‌డ‌తారు!

భ‌గ‌భ‌గ‌మంటూ మండుతున్న ఈ వ‌స్తువు ఓ పౌచ్‌. పౌచ్ అయినంత మాత్రాన ఊరికే కాలిపోతుందా? అని అనుకోవద్దు. ఆ పౌచ్‌లో వ్యాపింగ్ బ్యాట‌రీ అంటే.. రీఛార్జ్ చేసే బ్యాట‌రీలు ఉన్న పౌచ్ అది. రీఛార్జ్ చేసిన వెంట‌నే పేలిపోయి, ఇలా మంట‌ల బారిన ప‌డిందా పౌచ్‌. అందులో ఉన్న‌వి రెండు వ్యాపింగ్ బ్యాట‌రీలే.

ఈ రెండు బ్యాట‌రీలు ఏ స్థాయిలో పేలిపోయాయంటే.. దాన్ని ప‌ట్టుకెళ్తోన్న దంప‌తుల జుట్టు కూడా కాలిపోయింది. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా.. కారు కూడా మంట‌ల్లో చిక్కుకునేదే. ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌లో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. హ‌న్నా క్లార్క్‌, రిచ‌ర్డ్ జోలీ అనే దంప‌తులు కారులో వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న సంభ‌వించింది.

త‌మ కెమెరా కోసం ఈ వ్యాపింగ్ బ్యాట‌రీల‌ను వారు వాడుతున్నారు. అప్ప‌టిదాకా ఇంట్లో ఈ బ్యాట‌రీల‌ను ఛార్జింగ్‌కు ఉంచామ‌ని, ఓ పౌచ్‌లో వేసుకుని కారులో తీసుకెళ్లుండ‌గా.. ఉన్న‌ట్టుండి పెద్ద శ‌బ్దంతో పేలిపోయాయ‌ని, ఆ వెంట‌నే మంట‌లు అంటుకున్నాయ‌ని హ‌న్నా క్లార్క్ చెప్పారు.

దీనికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. పౌచ్‌ను ప‌ట్టుకుని ఉన్న రిచ‌ర్డ్ జోలి చేతికి గాయ‌మైంది. పేలిన వెంట‌నే పౌచ్ మంట‌ల బారిన ప‌డింది. పేలుడు దెబ్బ‌కు రిచ‌ర్డ్ జోలి, హ‌న్నా క్లార్క్ దంప‌తుల జుట్టు కాలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here