సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన కోర్టు..!

సల్మాన్ ఖాన్ ను దోషిగా తేలుస్తూ జోధ్ పూర్ కోర్టు తీర్పును ఇచ్చింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు కొద్ది సేపటి క్రితం తీర్పును వెలువరించింది. సల్మాన్ ఖాన్ కు ఒక ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. జోధ్ పూర్ కోర్టు ప్రాంగణంలో 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సినిమాలో నటీనటులను కూడా జోద్ పూర్ కోర్టు విచారిస్తూ వస్తోంది. సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబులను నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.


తీర్పు వెలువడక ముందే జోధ్ పూర్ జైలు అధికారులు సల్మాన్ కోసం ఓ గదిని శుభ్రం చేసి ఉంచారు. జోధ్ పూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, సెంట్రల్ జైల్లో సల్మాన్ కోసం ఓ గదిని శుభ్రం చేసి ఉంచామని చెప్పారు. ఆ గదిలో ఏసీ, కూలర్, ఫ్యాన్ లాంటి ప్రత్యేక సదుపాయాలేమీ లేవని తెలిపారు. రాజస్థాన్ కు చెందిన లారెన్స్ బిష్కోయ్ అనే గ్యాంగ్ స్టర్ సల్మాన్ ను చంపుతానని కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో, సల్మాన్ కు ప్రత్యేక భద్రతను కల్పిస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here