ఒకే పాడెపై త‌ల్లికి ఓ వైపు కుమారుడు, మ‌రో వైపు కుమార్తె మృత‌దేహాలు: ఊరు మొత్తం క‌న్నీట్లో

హైదరాబాద్‌: భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన జ్యోతి, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలకు అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. ముగ్గురి మృత‌దేహాల‌ను ఒకే పాడెపై ఉంచి అంత్యక్రియలను నిర్వ‌హించారు.

జ్యోతి స్వ‌గ్రామం తెలంగాణ‌లోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో అంత్య‌క్రియ‌ల‌ను పూర్తి చేశారు. ఒకేపాడెపై త‌ల్లి మృత‌దేహానికి కుడివైపున కుమారుడు, ఎడ‌మ‌వైపున కుమార్తె మృత‌దేహాల‌ను ఉంచి స్మ‌శాన వాటిక‌కు తీసుకెళ్లిన దృశ్యాల‌ను చూసి.. ప‌లువురు క‌న్నీరు పెట్టుకున్నారు.

ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని వారి క‌ళ్లు కూడా చెమ్మ‌గిల్లాయి. హృదయాలు ద్ర‌వించాయి. హైదరాబాద్‌ జిల్లెలగూడలో హ‌రీంద‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి త‌న‌ భార్య జ్యోతి, ఆరేళ్ల కుమారుడు అభితేజ్, నాలుగేళ్ల కుమార్తె సహస్త్రలను గొంతు నులిమి హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే.

జ్యోతి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. వారి అంతిమ‌యాత్ర‌ను చూడ‌టానికి గ్రామం మొత్తం త‌ర‌లివ‌చ్చింది. విషాదంలో మునిగిపోయింది. స్మ‌శానంలో ఒకే చితిపై ముగ్గురి మృత‌దేహాల‌ను ఉంచి అంత్య‌క్రియ‌లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here