ఎయిర్ హోస్టెస్ బట్టలు విప్పించారు.. వేసుకున్న శానిటరీ ప్యాడ్స్ కూడా వదలలేదు.. స్పైస్ జెట్ లో..!

సెక్యూరిటీ చెక్ పేరుతో ఇప్పటిదాకా ఎన్నో వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా విమానంలోకి ఎక్కే ముందు సెక్యూరిటీ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే తాజాగా ఎయిర్ హోస్టెస్ విషయంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదం అవుతోంది. విమానయాన సంస్థ స్పైస్ జెట్ తమ ఎయిర్ హోస్టెస్ బట్టలు విప్పించింది. అక్కడితో ఆగకుండా పీరియడ్స్ సమయంలో ఉన్న శానిటరీ ప్యాడ్స్ ను కూడా చెక్ చేశారట.

స్పైస్ జెట్ లో సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్ హోస్టెస్ లతో నగ్నంగా తనిఖీలు చేస్తుండడంపై ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ బయటపెట్టారు. చెన్నై విమానాశ్రయంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విధులకు హాజరయ్యే సమయంలో, విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో విధిగా తనిఖీలు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు జరిగింది చాలా హేయమైన చర్య అని తెలుస్తోంది.

మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఓ ఎయిర్ హోస్టెస్ ను ఈ ఉదయం వంటిపై వస్త్రాలు తీయించేసి తనిఖీ చేశారు. ఆమె పీరియడ్స్ కావడంతో శానిటరీ ప్యాడ్స్ ను కూడా తీసేయాలని సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించారు. గత్యంతరం లేక వాళ్ళు చెప్పింది చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ సమయంలో ఎక్కడ పడితే అక్కడ తాకారని వాపోయారు. గత మూడు రోజులుగా ఇదే విధంగా బట్టలు విప్పించేసి తనిఖీలు చేస్తున్నట్టు బయట పెట్టారు. ఎయిర్ హోస్టెస్ లు ఈ విషయంపై గొడవకు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here