రోడ్డు ప్ర‌మాదంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ క్రికెట‌ర్ త‌ల్లిదండ్రుల‌కు తీవ్ర గాయాలు!

ముంబై: టీమిండియా పేస్ బౌల‌ర్ శార్దుల్ ఠాకూర్ త‌ల్లిదండ్రులు రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం రాత్రి మ‌హారాష్ట్రలోని పాల్‌ఘ‌ర్ జిల్లాలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. త‌మ బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి హాజ‌రైన న‌రేంద్ర ఠాకూర్‌, హంస ఠాకూర్ తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా..వారు ప్ర‌యాణిస్తున్న‌ బైక్ అదుపు త‌ప్పింది. రోడ్డు ప‌క్క‌గా దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో వారిద్ద‌రూ గాయ‌ప‌డ్డారు. ఇద్ద‌రి చేతులు విరిగాయి. ఇద్ద‌రి కుడిచేతికి ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్టు డాక్ట‌ర్లు గుర్తించారు. ప్ర‌స్తుతం వారు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here