దెయ్యం వ‌దిలిస్తానంటూ బాలిక ప‌ట్ల అమానుషం: క‌న్న‌వారి ముందే పొత్తిక‌డుపుపై కాలుపెట్టి!

దెయ్యం వ‌దిలిస్తానంటూ ఓ వ్య‌క్తి మైన‌ర్ బాలిక ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ బాలిక త‌ల్లిదండ్రుల ముందే.. పైశాచిక‌త్వం ప్ర‌ద‌ర్శించాడు. బాలిక జుట్టు ప‌ట్టుకుని కొట్టాడు. ఈడ్చుకుంటూ వెళ్లాడు. అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రించాడు.

ఈ దారుణ‌ ఘ‌టన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఛిప్లీలో చోటు చేసుకుంది. ఈ వీడియో వెలుగులోకి రావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. మైన‌ర్‌పై భౌతిక‌దాడి కింద కేసు న‌మోదు చేశారు. ఆ వ్య‌క్తి ఓ పాస్ట‌ర్.

బాధిత బాలిక పేరు, ఇత‌ర వివ‌రాలు తెలియ‌రావ‌ట్లేదు. బాలికకు కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండ‌టంతో త‌ల్లిదండ్రులు చికిత్స చేయించారు. అయిన‌ప్ప‌టికీ.. బాలికకు త‌ర‌చూ జ్వ‌రం వ‌స్తుండేది.

క్రైస్త‌వులైన బాధిత బాలిక కుటుంబం ఓ పాస్ట‌ర్‌ను ఆశ్ర‌యించారు. అత‌ని పేరు దినేష్ సాహు. బాలిక‌కు దెయ్యం ప‌ట్టింద‌ని, దాన్ని వ‌దిలిస్తానంటూ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఓ గ‌దిలో అంద‌రూ చూస్తుండ‌గానే బాలిక జుట్టు ప‌ట్టుకుని కొట్టాడు.

ఆమె పొత్తి క‌డుపుపై కాలు పెట్టి నిల్చున్నాడు. ఈ దారుణానికి ఆ బాలిక కుటుంబీకులు స‌హ‌క‌రించ‌డం దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. ఈ వీడియో బ‌హిర్గతం కావ‌డంతో ఛిప్లీ పోలీసులు దినేష్ సాహును అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here