అత‌ని కోరిక తీరిస్తే..ఎంత డ‌బ్బ‌యినా ఇస్తాన‌న్నాడు: న‌టి అమలాపాల్‌

ప్ర‌ముఖ న‌టి అమలాపాల్‌ లైంగిక వేధింపులకు గుర‌య్యారు. చెన్నైకి చెందిన అల‌గేశన్ అనే వ్యాపార‌వేత్త త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు అమ‌లాపాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

బుధ‌వారం ఆమె చెన్నై మాంబ‌ళం పోలీస్‌స్టేష‌న్‌లో లిఖిత‌పూరకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు అల‌గేశ‌న్‌పై కేసు న‌మోదు చేశారు.

చెన్నైలోనే ఉన్న ఆయ‌న‌ను అరెస్టు చేశారు. మ‌లేసియాలో స్థిర‌ప‌డిన త‌మిళుల సంక్షేమం కోసం `డాజిలింగ్ త‌మిళ‌చ్చి` పేరుతో త్వ‌ర‌లో ఆమె ఆ దేశంలో ఓ మ్యూజిక‌ల్ నైట్‌లో పాల్గొన‌బోతున్నారు.

దీనికోసం మూడురోజుల కింద‌ట ఆమె చెన్నై టీన‌గ‌ర్ మ‌న్నార్ శాలైలోని ఓ డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు.

అదే ఇన్‌స్టిట్యూట్‌కు అల‌గేశ‌న్ కూడా వ‌చ్చేవాడ‌ని, త‌న‌తో మాట‌లు క‌లిపి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని పోలీసుల‌కు చెప్పారు. త‌న కోరిక ఎంత డ‌బ్బ‌యినా ఇస్తానంటూ ఫోన్ ద్వారా కూడా వేధించాడ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here