కుమార్తె మ‌తాంత‌ర వివాహం: కారులో పారిపోతున్న వ‌ధువును వెంటాడిన బంధువులు..చెట్టుకు కారు ఢీ

కూతురు తమ‌కు ఇష్టం లేని, మ‌తాంత‌ర వివాహాన్ని చేసుకుంటోంద‌న్న విష‌యం తెలిసింది ఆమె త‌ల్లిదండ్రులు, బంధ‌వులుకు. సినిమాల్లో చూపించిన‌ట్టుగా ఆమె కోసం కారులో వ‌చ్చారు.

ఈ విష‌యం తెలుసుకున్న వ‌ధువు.. వ‌రుడు ఇదివ‌ర‌కే అద్దెకు తెచ్చుకున్న కారులో పారిపోయారు. కారులో పారిపోతున్న కుమార్తెను ఇంకో కారులో వెంటాడారు బంధువులు.

అదే స‌మ‌యంలో.. కొత్త జంట ప్ర‌యాణిస్తోన్న కారు అదుపు త‌ప్పింది. చెట్టుకు బ‌లంగా ఢీ కొట్టింది. ఎంత బ‌లంగా ఢీ కొట్టిందంటే. కారు ఇంజిన్ కూడా డ్రైవ‌ర్ సీట్‌లోకి వ‌చ్చేసింది.

ఈ ఘ‌ట‌న‌లో కారు డ్రైవ‌ర్ అక్క‌డికక్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. వ‌ధువు, వ‌రుడికి గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ఇల్లెందుకు చెందిన సుమన్‌, షేహేల కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావటంతో షేహేల పెద్దలు ఈ పెళ్లికి అనుమ‌తి ఇవ్వ‌లేదు.

దీనితో వారిద్ద‌రూ త‌మ స్నేహితుల స‌హ‌కారంతో గుళ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌రువాత వ‌ధూవ‌రులిద్ద‌రూ ఇల్లెందు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. మేజ‌ర్లు కావ‌డంతో ఈ పెళ్లికి పోలీసులు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇరు కుటుంబాల పెద్ద‌ల‌ను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. వ‌ధూవ‌రులిద్ద‌రూ అద్దె కారులో హైదరాబాద్ వెళ్తోన్న విష‌యం తెలుసుకున్న షెహెల త‌ల్లిదండ్రులు, బంధువులు కారులో వెంబ‌డించారు.

కారు ఖమ్మం శివార్ల‌లోని గోపాల‌పురం వ‌ద్ద‌కు రాగానే అదుపు త‌ప్పింది. రోడ్డు ప‌క్క‌న చెట్టును బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవ‌ర్ దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. వారితోపాటు ఉన్న మ‌నో వ్య‌క్తి గాయ‌ప‌డ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here