ఘ‌రానా మొగుడు: క‌ట్టుకున్న భార్య‌ను స్నేహితుల‌తో క‌లిసి కిడ్నాప్ చేశాడు..దీని ఫ‌లితం?

క‌ట్టుకున్న భార్య‌ను త‌న స్నేహితుల‌తో క‌లిసి కిడ్నాప్ చేశాడో ఘ‌రానా మొగుడు. ఆమెను దారుణంగా హ‌త్య చేశాడు. ఈ ఘటన తెలంగాణ‌లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ఇల్లెందు కాకతీయ నగర్‌కు చెందిన ప్ర‌భాక‌ర్ అనే వ్య‌క్తి త‌న భార్య ప‌ద్మ‌, కుమారుడు, కుమార్తెతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. 12 సంవ‌త్స‌రాల కింద‌ట ప్ర‌భాక‌ర్‌కు ప‌ద్మ‌తో వివాహ‌మైంది.

ప్ర‌భాక‌ర్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ప‌ద్మ కూడా అదే వ్యాపారాన్ని నిర్వ‌హిస్తున్నారు. నాలుగేళ్లుగా వారిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఇద్ద‌రూ త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ ప‌డుతుండేవారు.

ఏడాదికాలం నుంచీ ఇద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్నారు. భ‌ర్త‌తో విడిపోయిన త‌రువాత రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానేసిన ప‌ద్మ‌.. ఖ‌మ్మం జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో ప‌నిచేస్తుండేది.

రోజూ ఆమె ఇల్లెందు నుంచి ఖ‌మ్మంకు వెళ్లి, వ‌స్తుండేది. వేరుగా ఉంటున్న‌ప్ప‌టికీ..ప్ర‌భాక‌ర్ త‌ర‌చూ ప‌ద్మ‌కు ఫోన్ చేసి బెదిరిస్తుండేవాడు. ఆ బెదిరింపుల‌ను నిజం చేశాడు.

గురువారం సాయంత్రం జ‌డ్పీ కార్యాల‌యం నుంచి ఇంటికి బ‌య‌లుదేరింది ప‌ద్మ‌. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఆమె ఇల్లెందుకు చేరుకుంది. బ‌స్ దిగి.. ఇంటికి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. దారిలో కాపు గాసిన భర్త త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆమెను ఆటోలో కిడ్నాప్ చేశాడు.

శివార్ల‌లోకి తీసుకెళ్లి హ‌త్య చేశాడు. ఆమె మృత‌దేహాన్ని మొట్ల‌గూడెం వ‌ద్ద ప‌డేసి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ప‌ద్మ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌భాక‌రే హంత‌కుడిగా నిర్ధారించారు. అత‌ని కోసం అన్వేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here