నేను వ‌ద్దంటున్నా, ఆ అమ్మాయే నా భుజానికి మందు రాసింది..అది బాడీ మ‌సాజ్ కాదు!

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట‌యిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ నోరు విప్పారు. తాను ఆత్మసాక్షిగా చెబుతున్నాన‌ని, త‌నపై ఫిర్యాదు చేసిన అమ్మాయిని బిడ్డ‌లా చూసుకున్నాన‌ని అన్నారు.

తాను మహిళలను అమితంగా గౌరవిస్తానని చెప్పారు. పోలీస్‌స్టేష‌న్‌లో ఆయ‌న త‌న‌ను క‌లిసిన విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ అమ్మాయిని వేధించలేద‌ని, ఆమె చేసిన ఫిర్యాదు నిరాధార‌మ‌ని అన్నారు.

లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదు చేయ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ చెప్పుకొచ్చారు. త‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అమ్మాయితో తాను బాడీ మ‌సాజ్ చేయించుకున్నట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని అన్నారు.

 

త‌న భుజానికి దెబ్బ తగిలింద‌ని, తాను వద్దంటున్నా ఆ అమ్మాయే స్వ‌చ్ఛందంగా వ‌చ్చి, భుజానికి మందు రాసిందని అన్నారు. అంతే త‌ప్ప మసాజ్ చేయించుకున్నానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించ లేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here