బోయిన్‌ప‌ల్లిలో ఇంట‌ర్ విద్యార్థిని అదృశ్యం: ఎవ‌రా అజ్ఞాత‌వ్య‌క్తి?

సికింద్రాబాద్ బోయిన్‌ప‌ల్లిలో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని అదృశ్యం అయ్యారు. క‌ళాశాల‌కంటూ బ‌య‌లుదేరిన ఆ విద్యార్థిని ఓ అప‌రిచ‌త వ్య‌క్తితో బైక్‌పై వెళ్తోన్న దృశ్యాలు ట్రాఫిక్ సిగ్న‌ళ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి.

ఆ వ్య‌క్తి ఎవ‌రో త‌మ‌కు తెలియ‌దని విద్యార్థిని త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. బోయిన్‌ప‌ల్లి తాడ్‌బండ్ ప్రాంతానికి చెందిన విజ‌య్‌, ల‌లిత దంప‌తుల కుమార్తె శ్రావణ్య‌.

బోయిన్‌ప‌ల్లిలోని ఓ ప్రైవేటు క‌ళాశాల‌లో ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్నారు. రోజూలాగే క‌ళాశాల‌కు వెళ్తున్నానంటూ చెప్పి ఇంట్లోంచి బ‌య‌టికి వ‌చ్చారామె.

సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఆమె ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఎంత సేప‌యిన‌ప్ప‌టికీ రాక‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు బోయిన్‌ప‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించారు.

శ్రావ‌ణ్య స్నేహితుల వ‌ద్ద ఆరా తీశారు. శ్రీ‌కాంత్ అనే వ్య‌క్తి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన‌ట్లు తేలింది. దీనితో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here