నిర్మాత మ‌న‌వ‌డి హ‌త్య‌కేసు: నిందితులు చెప్పింది విని..

బెంగ‌ళూరు: క‌న్న‌డ చ‌ల‌న చిత్ర నిర్మాత కుమార్ మ‌న‌వ‌డు రాహుల్‌ హ‌త్య‌కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్ద‌ర్ని అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు త‌ర‌లించారు. సెల్‌ఫోన్ కోసం తాము ఈ హ‌త్య చేసిన‌ట్లు నిందితులు అంగీక‌రించార‌ని పోలీసులు తెలిపారు.

బెంగ‌ళూరులోని నాయండ‌హ‌ళ్లి మెట్రో రైల్వేస్టేష‌న్‌లో ఈ నెల 13వ తేదీన రాహుల్‌ను స‌ద్దాం హుస్సేన్‌, మ‌హమ్మ‌ద్ ష‌ఫీ అనే ఇద్ద‌రు హ‌త‌మార్చారు. రాహుల్ వ‌ద్ద ఉన్న ఖ‌రీదైన సెల్‌ఫోన్ హ్యాండ్‌సెట్‌ను త‌స్క‌రించే ప్ర‌య‌త్నంలో అత‌ణ్ని హ‌త్య చేయాల్సి వ‌చ్చింద‌ని నిందితులు తెలిపార‌ని పోలీసులు చెప్పారు.

ఫోన్‌లో మాట్లాడుతున్న రాహుల్ గొంతుపై క‌త్తి పెట్టి బెదిరించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా చోటు చేసుకున్న పెనుగులాట‌లో అత‌ణ్ని హ‌త్య చేశామ‌ని అన్నారు. అనంత‌రం వారు హ్యాండ్‌సెట్‌ను దొంగిలించి, పారిపోగా.. సెల్ ట‌వ‌ర్ సిగ్న‌ళ్ల ఆధారంగా బ్యాట‌రాయ‌న‌పుర‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here