ఆర్టీసీ బ‌స్సు..స‌గం అటు, స‌గం ఇటు! టైర్లు మ‌రోవైపు

అతి వేగానికి అద్దం ప‌డుతున్న ఫొటో ఇది. అతి వేగంతో ప్ర‌యాణిస్తోన్న ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పింది. క‌ల్వ‌ర్టును ఢీ కొట్టింది. దాని పైకి ఎక్కేసింది.

ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో బ‌స్సు ఎంత వేగంతో ప్ర‌యాణిస్తోందంటే.. క‌ల్వ‌ర్టును ఢీ కొట్టి, దాని పైకి దూసుకెళ్లిన వెంట‌నే దాని ముందు, వెనుక వైపు చ‌క్రాలు ఊడిపోయి బ‌య‌టికి వ‌చ్చేశాయి.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజన‌గ‌ర జిల్లాలో చోటు చేసుకుంది. కేర‌ళ‌కు చెందిన ఆర్టీసీ బ‌స్సు అది. మైసూరు నుంచి కేర‌ళ‌లోని కోజికోడ్‌కు 30 మంది ప్ర‌యాణికులతో బ‌య‌లుదేరిన ఆ రాష్ట్ర బ‌స్సు.. మార్గ‌మ‌ధ్య‌లో గుండ్లుపేటె దాటిన త‌రువాత భీమ‌న‌బీడు స‌మీపానికి రాగానే అదుపు త‌ప్పింది.

వేగంగా వెళ్లి క‌ల్వ‌ర్టు పైకి ఎక్కేసింది. ఆ వేగానికి బ‌స్సు చ‌క్రాలు ఊడి వ‌చ్చేశాయి. క‌ల్వ‌ర్టు ప‌క్క‌నే ఉన్న కాలువ‌లో ప‌డిపోయాయి.

ఈ ప్ర‌మాదంలో కండ‌క్ట‌ర్ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ప‌లువురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై గుండ్లుపేటె పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here