పుణే అమ్మాయి! కాశ్మీరీ యువ‌కుడిని పెళ్లాడింది..కేవ‌లం దాని కోస‌మే!

మ‌హారాష్ట్రలోని పుణె ఎక్క‌డ‌.. జ‌మ్మూ కాశ్మీర్ ఎక్క‌డ‌! అయిన‌ప్ప‌టికీ.. ప‌ట్టుబ‌ట్టి కాశ్మీరీ యువ‌కుడిని పెళ్లి చేసుకుందో పుణె అమ్మాయి. అతనితో క‌లిసి ఆ రాష్ట్రంలో కాపురం పెట్టింది.

ఆమెకు ప్ర‌స్తుతం ఓ కుమారుడు కూడా. అయిన‌ప్ప‌టికీ.. తాను చేయ‌ద‌ల‌చుకున్న‌ది చేయాల‌నుకున్న‌ది. మాన‌వ‌బాంబుగా మారి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో విధ్వంసం సృష్టించాల‌ని కుట్ర ప‌న్నింది.

ఈ కుట్ర‌ను పోలీసులు, ఆర్మీ జ‌వాన్లు భ‌గ్నం చేశారు. ఆమె అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాధార‌ణంగా స్వాతంత్ర్య దినోత్స‌వం, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం వంటి ప్ర‌త్యేక రోజుల్లో ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాలు విస్తారంగా ఉంటాయక్క‌డ‌. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పలు ప్రాంతాల్లో విస్త్రృత తనిఖీలు చేపట్టారు. ఈ త‌నిఖీల సంద‌ర్భంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here