ఫైండింగ్ `నీమో` సినిమా: మొన్న‌ ల‌లిత్ మోడీ, నిన్న నీర‌వ్ మోడీ, మ‌ధ్య‌లో మాల్యా..రేపు?

బ్యాంకులను అడ్డంగా మోస‌గించి, నిలువునా ముంచేసి.. ద‌ర్జాగా విమానం ఎక్కి మ‌రీ దర్జాగా పారిపోయిన మాయ‌గాళ్ల జాబితా ఇది. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక బోర్డుగా పేరున్న బీసీసీఐని అడ్డంగా ముంచేసి, విమానం ఎక్కి పారిపోయాడు ల‌లిత్ మోడీ.

జ‌నం సొమ్మును భ‌ద్రంగా కాపాడే బ్యాంకుల‌ను నిలువునా ముంచేసి మ‌రీ దేశం విడిచి పారిపోయారు విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోడీ. ఈ నీర‌వ్ మోడీ అనే గుజ‌రాతీయుడు మాల్యాకంటే రెండాకులు ఎక్కువే చ‌దివాడు.

అందుకే.. మాల్యా 9,400 కోట్ల రూపాయ‌ల మేర బ్యాంకుల‌కు కుచ్చుటోపీ పెడితే నీర‌వ్ మోడీ ఒకే ఒక్క బ్యాంకు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకును ఏకంగా 11 వేల కోట్ల రూపాయ‌లతో ముంచేశాడు.

ల‌లిత్ మోడీ, మాల్యా లండ‌న్‌లో తిష్ట‌వేసి కూర్చున్నారు. వారికి కాస్త డిఫ‌రెంట్‌గా నీరవ్ మోడీ స్విట్జ‌ర్లాండ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు ఫ్యామిలీతో స‌హా. మ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో క‌లిసి దావోస్‌లో ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొన్నాడు.

 

న‌రేంద్ర‌మోడీతో క‌లిసి గ్రూప్ ఫొటోకు ఫోజులూ ఇచ్చాడు. ఇక్కడ బ్యాంక‌ర్లకు మాత్రం ఫైండింగ్ `నీమో` (నీర‌వ్ మోడీ) అంటూ సినిమా చూపిస్తున్నాడు. నీర‌వ్ మోడీ చేసిన ఘ‌న‌కార్యంపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో రెచ్చిపోతున్నారు. పోటీ ప‌డి కామెంట్లు పెట్టేస్తున్నారు.

https://twitter.com/ikpsgill1/status/964106036561920000

https://twitter.com/James_Beyond/status/964063105616699392

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here