అమ్మాయిలు..తాగారు, తూలారు: సంద‌ట్లో స‌డేమియా అంటూ పోకిరీలు రెచ్చిపోయారు!

బెంగ‌ళూరులో కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లకు పెట్టింది పేరు బ్రిగేడ్ రోడ్‌, ఎంజీ రోడ్‌. ఈ సారి చ‌ర్చి స్ట్రీట్‌లోనూ కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ఏర్పాటు చేశారు.

ఈ మూడు చోట్లా తెల్ల‌వారు జాము వ‌రకూ కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు కొన‌సాగాయి. వంద‌లాది మంది యువ‌తీ, యువ‌కులు ఇందులో పాల్గొన్నారు.

సంద‌ట్లో స‌డేమియా అంటూ యువ‌తుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించడం, వారిని లైంగిక వేధింపుల‌కు గురి చేయ‌డం వంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు 2017 డిసెంబ‌ర్ 31న పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి పోలీసుల‌ను భారీగా మోహ‌రింప‌జేశారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు ఆక‌తాయిలు త‌మ వైఖరిని మార్చుకోలేదు.

తిప్ప‌సంద్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు యువతులు బ్రిగేడ్ రోడ్‌కు రాగా.. వారిని ల‌క్ష్యంగా చేసుకుని పోకిరీలు రెచ్చిపోయారు. వారి ఒంటిపై చేతులు వేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు అరెస్టు చేశారు. ఎంజీ రోడ్‌లోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

ఎంజీ రోడ్‌లో కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లకు హాజ‌రైన విదేశీ యువతుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన ఇద్ద‌రు యువ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని చోట్ల యువతులు మ‌ద్యం మ‌త్తులో తేలిపోవ‌డం కూడా క‌నిపించింది.

మ‌ద్యం ఎక్కువై అమ్మాయిలు తూలి ప‌డ‌టం, వాంతులు చేసుకోవ‌డం వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here