ఆరో అంత‌స్తు నుంచి దూకిన మ‌హిళ‌: ఆత్మ‌హ‌త్యే అనుకున్నారు..హంత‌కుడెవ‌రో తెలిసి ఉలిక్కిప‌డ్డారు

అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ, న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న త‌ల్లిని దారుణంగా హ‌త‌మార్చాడో కుమారుడు. న‌డ‌వ‌లేని స్థితిలో మంచంపై ఉన్న ఆమెను బ‌ల‌వంతంగా అపార్ట్‌మెంట్‌పైకి తీసుకెళ్లి, అక్క‌డి నుంచి కిందికి తోసేశాడు.

నాలుగంత‌స్తుల ఎత్తు నుంచి కిందికి ప‌డ‌టంతో అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించిందా తల్లి. దీన్ని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించాడు. చివ‌రికి సీసీ కెమెరాల ద్వారా అత‌ని గుట్టుర‌ట్ట‌యింది. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది.

ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఎంత ఆల‌స్యంగా అంటే.. ఈ ఘ‌ట‌న గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌ 27న‌లో చోటు చేసుకోగా.. బుధ‌వారం బ‌హిర్గ‌త‌మైంది. విచిత్ర‌మేమిటంటే.. అత‌ని మాట‌ల‌ను అంద‌రూ విశ్వ‌సించారు.

అలా విశ్వ‌సించేలా చేశాడ‌త‌ను. రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్ ప్రాంతంలో ఉన్న ద‌ర్శ‌న్ అపార్ట్‌మెంట్‌లో నివ‌సించే జ‌య‌శ్రీ‌బెన్ వినోద‌భాయ్ నాథ్వాని తాను నివ‌సించే అపార్ట్‌మెంట్ ఆరో అంత‌స్తు నుంచి అనుమానాస్ప‌ద రీతిలో కింద‌ప‌డి మ‌ర‌ణించింది.

ఆమె కుమారుడు సందీప్‌.. అది ఆత్మ‌హ‌త్య‌గా అంద‌ర్నీ న‌మ్మించాడు. అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేసుకున్న పోలీసుల‌కు షాకింగ్ ట్విస్ట్‌లు ఎదుర‌య్యాయి.

జ‌య‌శ్రీ‌బెన్ కుమారుడు సందీపే ఆమెను పైనుంచి కిందికి తోసి చంపిన‌ట్లు తేలింది. సంఘ‌ట‌న చోటు చేసుకున్న స‌మ‌యంలో సందీప్‌.. త‌న త‌ల్లిని బ‌ల‌వంతంగా అపార్ట్‌మెంట్‌పైకి తీసుకెళ్తున్న దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి.

వాటి ఆధారంగా సందీప్‌ను విచారించ‌గా.. త‌ల్లిని తానే హ‌త్య చేసిన‌ట్టు అంగీక‌రించాడు. అత‌నిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.

https://youtu.be/VYhAMB8Y0xY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here